Posts

Showing posts from April, 2016

వీధి బాలలను విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో తనవంతు సాయం

Image
కర్ణాటకు చెందిన విజయ్‌కుమార్‌ ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టినప్పట్నుంచి అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. చిన్నప్పటి నుంచే సేవాదృక్పథం ఉన్న విజయ్‌కుమార్ విధులతో పాటు పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. వీధి బాలలను విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో తనవంతు సాయం చేస్తున్నారు. పేద విద్యార్థులకు సేవలందించాలని జిల్లాలో ఎన్నో సేవాకార్యక్రమాలు చేపడుతున్న ఏకలవ్య ఆశ్రమం సేవా భారతిని ఐపీఎస్ విజయ్ కుమార్ కోరారు. ఏఎస్పీ సేవా తత్పరతకు ఈ కింది ఫోటోయే నిదర్శనం. ఇలాంటి అధికారులు జిల్లాకు ఒక్కరున్నాచాలని మంచిర్యాల ప్రజలు అంటున్నారు.

Source: http://www.andhrajyothy.com/Artical?SID=206126